Manchu Lakshmi: 'నా అతిపెద్ద కల నెరవేరింది'.. మంచు లక్ష్మి స్పెషల్ పోస్ట్
Manchu Lakshmi: మంచు లక్ష్మి.. ముందుగా బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తర్వాతే నటిగా వెండితెరపై కనిపించింది.;
Manchu Lakshmi: టాలీవుడ్‌లో వారసులుగా వచ్చిన హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలా తక్కువ. ఇప్పటికీ స్టార్ హీరోల, నిర్మాతల వారసులుగా వచ్చిన ఎంతోమంది నటులు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ అలా వచ్చిన హీరోయిన్ల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో ఒకరు మంచు లక్ష్మి. త్వరలోనే లక్ష్మి.. తన తండ్రితో కలిసి నటించనుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపెట్టింది.
మంచు లక్ష్మి.. ముందుగా బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తర్వాతే నటిగా వెండితెరపై కనిపించింది. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తను.. తక్కువ సమయంలోనే సొంత గుర్తింపు సాధించింది. కానీ ఆమె నటిగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మంచు లక్ష్మి.. తెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. అందుకే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతోంది.
'ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు నేను కేవలం నా సూపర్ స్టార్ తండ్రితో కలిసి నటించడం మాత్రమే కాదు.. ఆయనతో కలిసి నిర్మాతగా కూడా పనిచేసే అవకాశాన్ని పొందాను. విమర్శకులను ఎప్పుడూ పట్టించుకోవద్దు. నీ మనసు చెప్పిందే చేయి. నాకు ఇది ఒక పెద్ద కల నెరవేరడం లాంటిదే. మా సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నందుకు నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను. అదే 'అగ్ని నక్షత్రం'' అని టైటిల్ గ్లింప్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంచు లక్ష్మి.