Manchu Manoj: 'ఆ విషయంలో మాటిస్తున్నాను'.. మంచు మనోజ్ ట్వీట్
Manchu Manoj: మంచు మనోజ్ మాత్రం స్క్రీన్‌పై కనిపించి అయిదేళ్లు అయ్యింది.;
Manchu Manoj:మంచు మోహన్ బాబు వారసులు అందరూ ప్రస్తుతం సినీ పరిశ్రమలోనే సెటిల్ అయ్యారు. మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్.. ఇప్పటికే నటీనటులుగా మంచి గుర్తింపు అందుకున్నారు. కానీ గతకొంతకాలంగా వీరు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించేశారు. రెండేళ్లకు ఒక సినిమా.. అలా చేస్తున్నారు. కానీ మంచు మనోజ్ మాత్రం స్క్రీన్‌పై కనిపించి అయిదేళ్లు అయ్యింది. తాజాగా ఈ హీరో తన ట్విటర్‌లో ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు.
'ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమకు, అభినందనలకు ధన్యవాదాలు. ఈరోజుతో తెలుగు సినీ పరిశ్రమలో నేను 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. యాక్టర్‌గా మాత్రమే కాదు మనిషిగా కూడా ఈ ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. నేను మీకు సరిపడా థ్యాంక్యూ చెప్పుకోలేను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మీరందరూ ఇచ్చిన సపోర్ట్. నా మొదటి సినిమా నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ నమ్మకం నన్ను ఇండస్ట్రీలో ఎదిగేలా చేసింది.'
'నేను గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని తెలుసు. ఇది నాకు చాలా కావాల్సిన బ్రేక్. కానీ ఏం జరిగినా కూడా మీరెప్పుడు మీ మనసుకు నన్ను దగ్గరే చేసుకున్నారు. నా ఫ్యాన్స్, నా ఫ్యామిలీ, నాన్న, అన్నయ్య, ముఖ్యంగా ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న మా అక్కకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను కచ్చితంగా స్ట్రాంగ్‌గా తిరిగొస్తానని మాటిస్తున్నాను.' అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్.
Thank you and love you all 🙏🏼 #18YearsOfManojManchuInTFI 🙏🏼🙏🏼 pic.twitter.com/QNRB2MGapi
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2022