Mosagallu Trailer : లక్ష్మీ దేవి ఎందుకంత రిచ్ తెలుసా!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మోసగాళ్లు'.. ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.;
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మోసగాళ్లు'.. ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో మోసగాళ్లు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు చిరు. ఇక ట్రైలర్ విషయానికీ వచ్చేసరికి.. రెండు నిమిషాల నలబై సెకండ్స్ ఉన్న ట్రైలర్.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
'డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని' అనే డైలాగ్‌తో మొదలైన చిత్ర ట్రైలర్ ఉత్కంఠను రేపుతోంది. చిత్ర ట్రైలర్ లో విష్ణు, కాజల్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. జాఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.