Manchu Vishnu Manifesto : 'మా' భవనాన్ని నా సొంత డబ్బులతో కడతా.. ప్రతి ఒక్కరికీ ఫ్రీ హెల్త్‌ ఇన్స్యూరెన్స్ ..!

Manchu Vishnu Manifesto : 'మా' ఎలక్షన్‌ మేనిఫెస్టోను ప్రకటించారు మంచు విష్ణు. అవకాశాలు లేని కొందరు నటీనటులకు తాము ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు.

Update: 2021-10-07 10:42 GMT

Manchu Vishnu Manifesto : 'మా' ఎలక్షన్‌ మేనిఫెస్టోను ప్రకటించారు మంచు విష్ణు. అవకాశాలు లేని కొందరు నటీనటులకు తాము ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. 'మా' యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ కోసం తన సొంత డబ్బుతో భవనాన్ని నిర్మిస్తామన్నారు. దీనికోసం ఇప్పటికే 3 స్థలాలను పరిశీలించడం జరిగిందని... అందరి అభిప్రాయం మేరకు భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన సభ్యులందరికీ ప్రభుత్వంతో మాట్లాడి సొంత ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఫ్రీ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రతి ఒక్కరికీ చేయిస్తామన్నారు. ఇది ఒక కుటుంబంలోని అందరికీ కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేస్తామని మంచు విష్ణు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News