మెగాస్టార్ "భోళా మేనియా" ఫస్ట్ లిరికల్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చిరు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది;
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చిరు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమా నుంచి మెదటి పాటను విడుదల చేసింది. దీంతో మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. భోళా మేనియా అంటూ సాగే ఈ లిరికల్ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఆదివారం విడుదల చేశాడు.
అయితే ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతీ స్వర సాగర్ సంగీతం అందించగా.. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు లిరిక్స్ అందించాడు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై కేఎస్ రామారావు, రాంబ్రహ్మం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమేశ్ మెహెర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా లో మెగాస్టార్ పక్కన మిల్క్‌బ్యూటీ తమన్నా చిందులేయనుంది. చిరుకి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తోంది. దీంతో అభిమానులు భోళా శంకర్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగష్టు,11వ తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఇటీవలే వెల్లడించింది.