Mehaboob Dilse: మెహబూబ్ తల్లి హఠాన్మరణం.. ఎమోషనల్ నోట్ షేర్..

Mehaboob Dilse: మెహబూబ్ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2022-08-07 10:11 GMT

Mehaboob Dilse: ముందుగా కవర్ సాంగ్స్ చేస్తూ.. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు మోహబూబ్ దిల్‌సే. ఇక బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన గురించి చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. అయితే ప్రస్తుతం మెహబూబ్ కెరీర్ ఫుల్ స్పీడ్‌లో సాగిపోతోంది. ఇంతలోనే తన ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన తల్లి మరణించింది. ఈ విషయాన్ని మెహబూబ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

'అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయావు. ఇకపై నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? ఎవరితో రోజూ మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి అమ్మ. నువ్వు లేకుండా ఎప్పుడూ నేను నా జీవితాన్ని ఊహించుకోలేదు. నువ్వు నాకు ఏ విషయంలోనూ అడ్డుచెప్పలేదు. నేను రోజురోజుకీ ఎదగడం చూస్తూ ఉన్నావు. నా ఎత్తుపల్లాలు అన్నింటిలో నువ్వు తోడుగా ఉన్నావు. నీ మాటలతో నాకు ధైర్యం చెప్పావు. అవే నన్ను ముందుకు నడిపించాయి.'

'నువ్వు మాకోసం చాలా పోరాడావు. మా జాగ్రత్తలు చూసుకోవడం కోసం నువ్వు జీవితంతోనే పోరాడావు. నువ్వు మాకోసం ఇంకెవరూ చేయనంత చేశావు. నీకు సంబంధించినవి అన్నీ నువ్వు మాకోసం త్యాగం చేశావు. నువ్వు లేకుండా జీవితాన్ని ముందుకు ఎలా నడిపించాలో అర్థం కావడం లేదు అమ్మ. నేను నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతాను అమ్మ. నువ్వు నాకు జీవితం అంటే నేర్పించావు'.

'నువ్వు నన్ను చూస్తూ ఉంటావని నాకు తెలుసు అమ్మ. నేను ఎప్పుడూ నువ్వు గర్వపడేలా చేస్తా. సుభాన్‌ను, నాన్నను బాగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. 2022 ఆగస్ట్ 5 నాకు ఒక పీడకలలాంటిది. అంత క్షణాలలో జరిగిపోయింది. తనకు గుండెపోటు వచ్చింది. మమ్మల్ని ఇలా కన్నీళ్లలో వదిలేసి వెళ్లిపోయింది.' అంటూ తన తల్లి గురించి ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు మెహబూబ్. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు మెహబాబు తల్లి మరణానికి సంతాపం తెలియజేశారు.


Tags:    

Similar News