Mohan Babu on Pawan : చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌.. పవన్ కామెంట్స్ పై మోహన్ బాబు..!

Mohan Babu on Pawan :రిపబ్లిక్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు..

Update: 2021-09-26 11:59 GMT

రిపబ్లిక్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. 'నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌ కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌ కల్యాణ్‌గారు అనడంతో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్‌ 10వ తేదిన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.



Tags:    

Similar News