Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌తో కారులో చైతూ రొమాన్స్.. ఇంతలో పోలీసులు..
Naga Chaitanya: లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య రియల్ లైఫ్‌లో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో ప్రేక్షకులకు తెలియదు.;
Naga Chaitanya: నాగచైతన్య ఓ పర్ఫెక్ట్ లవర్ బాయ్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల 'లాల్ సింగ్ చడ్డా'తో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. త్వరలోనే సోలో హీరోగా హిందీలో ఓ సినిమా కూడా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక లాల్ సింగ్ చడ్డా కోసం ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన్న చైతూ ఓ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టాడు.
ఆన్ స్క్రీన్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య రియల్ లైఫ్‌లో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో ప్రేక్షకులకు తెలియదు. అలాంటి విషయాల గురించి చైతూ కూడా ఎప్పుడూ అంత సౌకర్యంగా మాట్లాడలేదు. కానీ లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో ప్రేక్షకులు ఓ కొత్త చైతూను చూశారు. తన లైఫ్‌లోని చాలా పర్సనల్ విషయాలు ఈ సందర్భాల్లోనే బయటపెట్టాడు.
తాజాగా ఒకసారి రైల్వే స్టేషన్‌లో తన ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని నాగచైతన్య చెప్పిన విషయం సంచలనంగా మారింది. అయితే కారు వెనుక సీటులో ఓసారి చైతన్య తన గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకుంటున్నాడట. అదే సమయంలో పోలీసులకు తాను పట్టుబడ్డానని చెప్పుకొచ్చాడు చైతూ. కానీ ఇది ఎప్పుడు, ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరూ అనేది నాగచైతన్య బయటపెట్టలేదు.