Naga Babu On Naresh : పెద్దరికం చెలాయించాలని చిరంజీవి ఎప్పుడు అనుకోలేదు : నాగబాబు

Naga Babu On Naresh : 'మా' ఎన్నికలు అయిపోయాయి.. ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశాడు..

Update: 2021-10-13 09:46 GMT

Naga Babu On Naresh : 'మా' ఎన్నికలు అయిపోయాయి.. ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశాడు.. కానీ వివాదాలు, ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు.. వరుస రాజీనామాలతో మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో నటుడు నరేష్..  మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు

ఆయన మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించాలని చిరంజీవి ఎప్పుడు అనుకోలేదన్నారు. నటీనటులు, అభిమానులు సహాయం కోరి వస్తే చేతనైనంత సహాయం చేశాడు తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని అధికారం చెలాయించాలని, అహంకారం చూపించాలని అనుకోలేదని సమాధానం ఇచ్చారు నాగబాబు.

ఇక తాను 'మా కు రాజీనామా చేయడం పట్ల నాగబాబు మాట్లాడుతూ.. 'మా' లో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడ్డానని అన్నారు. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్నానని, అయితే ఫలితాలు మరోరకంగా రావడంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలని లేదని, అందుకే మా నుంచి బయటకు వచ్చానని అన్నారు. ఇక నుంచి 'మా' కు తనకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

అంతకుముందు ఎన్నికల ఫలితాల తర్వాత నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయిందని, ఆయన స్థానం కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కలేదని అన్నారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే అర్హత మోహన్‌ బాబుకు ఉందని, దాసరి బ్రతికి ఉంటే ఇదే విషయాన్ని చెప్పేవారని అన్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదని చాలా మంది పెద్దవాళ్ళున్నారని, అన్నింటికీ చిరంజీవినే అనడం సరికాదని నరేష్ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News