సింగర్ సునీత రెండో పెళ్లిపై నాగబాబు ట్వీట్!
టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్నారు.;
టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్నారు. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అత్యంత సన్నీహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సునీత అభిమానులు, సినీ సెలబ్రిటీలు సునీతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు..
'సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు నాగబాబు. ఇక సునీత, రామ్ లకి ఇది రెండో వివాహమేనన్న సంగతి తెలిసిందే!