Nani: ప్రశాంత్ నీల్‌తో పాన్ ఇండియా మూవీ.. క్లారిటీ ఇచ్చిన నాని..
Nani: అంటే సుందరానికి ప్రమోషన్స్ సమయంలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు నాని.;
Nani: ప్రస్తుతం సౌత్‌లో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే.. అది ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందన్న ఆలోచనతో మేకర్స్ ఈ నిర్ణయానికి వస్తున్నారు. అయితే ఇప్పటివరకు కెరీర్‌లో పాన్ ఇండియా చిత్రం చేయని నాని కూడా శాండిల్‌వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్‌పై నాని ఇటీవల స్పందించాడు.
ఫ్యామిలీ సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హిట్లు కొట్టడంలో నాని దిట్ట. నాని నటిస్తున్నాడంటే చాలు.. సినిమాపై ప్రత్యేకంగా అంచనాలు పెరిగిపోతాయి. ఎన్ని వరుస హిట్లు వచ్చినా కూడా నాని.. కమర్షియల్ కథలవైపు పెద్దగా వెళ్లడు. తాను నటించే ప్రతీ సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి అనుకుంటాడు. ఇక తను నటించిన 'అంటే సుందరానికి' చిత్రం విడుదలకు సిద్ధమవ్వడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు నాని.
అంటే సుందరానికి ప్రమోషన్స్ సమయంలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు నాని. ప్రస్తుతం 'దసరా' అనే చిత్రం చేస్తున్న నాని.. దాని షూటింగ్ను 25 శాతం పూర్తి చేసినట్టుగా తెలిపాడు. ప్రశాంత్ నీల్‌తో సినిమా గురించి నానిని ప్రశ్నించగా.. మహేశ్‌తో మూవీ, ప్రశాంత్ నీల్‌తో పాన్ ఇండియా చిత్రం అంటూ చాలా రూమర్స్ వస్తున్నాయని, అవి ఏవీ నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు.