Naresh Pavitra Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
వివిహాబంధంతో ఒక్కటైన నరేశ్-పవిత్రాలోకేశ్; అతికొద్ది మంది సన్నిహితుల నడుమ వివాహ వేడుక;
కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ముదురు జంట నరేశ్ -పవిత్రా లోకేశ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ బంధాన్ని ధృఢపరచుకోవాలన్న సంకల్పంతో అతి కొద్ది మంది సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం నరేశ్ పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసి వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని నరేశ్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. దీంతో పాటే తమ వివాహవేడుక వీడియోను కూడా షేర్ చేశారు. ఈ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.