బిగ్ బ్రేకింగ్.. నలుగురు హీరోయిన్లకు ఎన్‌సీబీ సమన్లు
సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు పంపింది;
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో NCB తీగ లాగితే డొంక కదులుతోంది. డ్రగ్స్ కేసులతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఉలిక్కిపడుతున్నాయి. ఇప్పటికే దీపికా పదుకోణ్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని దీపికకు సమన్లు పంపింది. ఇక తాజాగా సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు పంపింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని శ్రద్ధా, సారా, రకుల్‌లకు సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. మరోవైపు నమ్రతా శిరోద్కర్‌కు కూడా ఎన్‌సీబీ సమన్లు జారీ చేయనున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు, హిందీ చిత్రాలు నిర్మించిన నిర్మాత మధు మంతెనకు ఎన్‌సీబీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నిన్న దీపికా పదుకోన్ మేనేజర్‌ను ప్రశ్నించిన ఎన్‌సీబీ... ఇవాళ జయ సాహూను మరోసారి ఇంటరాగేట్ చేసింది. ఇక టీవీ యాక్టర్లు సనమ్ జోహార్, అభిగేల్ పాండేలను సైతం డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ ప్రశ్నించింది. సనమ్ జోహార్, అభిగేల్‌ల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.