Nithya Menen: త్వరలో నిత్యా మీనన్ పెళ్లి.. స్టార్ హీరోతో..
Nithya Menen: నిత్యా మీనన్ ప్రేమలో ఉందని లేదా డేటింగ్ అని రూమర్స్ అనేవి ఇప్పటివరకు రాలేదు.;
Nithya Menen: మూడు పదుల వయసు దాటిందంటే చాలు.. హీరోహీరోయిన్ల పెళ్లి గురించే అంతటా హాట్ టాపిక్‌గా మారుతుంది. అంతే కాకుండా వారు ఎక్కడికి వెళ్లినా.. దీని గురించి ప్రశ్నలు ఎదురవుతాయి.. ఆ ప్రశ్నలకు కాస్త అటు ఇటుగా సమాధానం ఇచ్చినా డేటింగ్ అంటూ రూమర్స్ కూడా మొదలయిపోతాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్‌పై కూడా ఇలాంటి పెళ్లి రూమర్సే వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు నిత్యామీనన్.
గ్లామర్‌తో కాకుండా కేవలం యాక్టింగ్, పర్ఫార్మెన్స్‌తో కూడిన పాత్రలనే ఎంచుకోవాలని చాలామంది హీరోయిన్స్ భావిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు నిత్యా మీనన్. తన కెరీర్‌ను ప్రారంభించిన దగ్గర నుండి తనకు నచ్చకుండా ఏ సినిమాను ఒప్పుకోలేదు.. ప్రాధాన్యత లేని ఏ పాత్రలో నటించలేదు నిత్య. అలా తన లిమిట్స్‌లో ఉంటూనే స్టార్ హీరోలతో సైతం జతకట్టింది ఈ ముద్దుగుమ్మ.
నిత్యా మీనన్ ప్రేమలో ఉందని లేదా డేటింగ్ అని రూమర్స్ అనేవి ఇప్పటివరకు రాలేదు. కానీ మొదటిసారి ఏకంగా నిత్యామీనన్ ఓ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయ్యిందంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఓ స్టార్ హీరోతో నిత్యా.. గతకొంతకాలంగా క్లోజ్‌గా ఉంటుందని.. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని ఫిల్మ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ హీరో ఏ భాష వారని మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే నిత్యా మీనన్ స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.