పవన్ కి జోడిగా నిత్యామీనన్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళీ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.;
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళీ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్‌కి జోడిగా నటించేంది ఎవరనే విషయంలో చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. అయితే ఆ సందేహాలన్నింటికీ తెరదించుతూ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించారు మేకర్స్,.. ఇందులో నిత్యామేనన్ పవన్‌కి జోడిగా నటించనుంది. ఇక రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటించనుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.