Tollywood: 'పరమపద సోపానం' టీజర్ విడుదల

"ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి"

Update: 2023-06-24 08:53 GMT


మాఫియా అక్రమాల నేపథ్యంలో SS మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న  సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది.  తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

"ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి" అనే డైలాగ్ తో ప్రారంభమైన  టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేశారు.  టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు నాగ శివ  దర్శకత్వం వహించగా..  గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News