Pavithra Lokesh: నరేశ్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.. వీడియో రిలీజ్..
Pavithra Lokesh: నరేశ్, పవిత్రా లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.;
Pavithra Lokesh: సీనియర్ హీరో నరేశ్.. ప్రస్తుతం తండ్రి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తను.. నటి పవిత్రా లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే నరేశ్ మూడో భార్య రమ్య.. వీరి రిలేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో విసిగిపోయిన పవిత్రా లోకేశ్.. ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో తనకు, నరేశ్‌కు మధ్య ఏం లేదని స్పష్టం చేశారు పవిత్రా లోకేశ్. తాను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదని, ప్రస్తుతం తాను ఎదుర్కుంటున్న సమస్య గురించి ప్రేక్షకులతో పంచుకోవడానికే ఇలా వీడియో ద్వారా ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. నరేశ్ మూడో భార్య రమ్య.. బెంగుళూరు వెళ్లి అక్కడ అందరి ముందు తాను, నరేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని ఆరోపించారని, దోషిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు పవిత్రా లోకేశ్.
ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే, తనకు తనభర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలని రమ్యను ఉద్దేశించి అన్నారు పవిత్రా లోకేశ్. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడుకోవాల్సిందని, కానీ బెంగుళూరు వచ్చి తనను దోషిగా చూపించారని చెప్పారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అన్నారు పవిత్రా. ఇప్పటికైనా అందరూ తనకు, నరేశ్‌కు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక పవిత్రా లోకేశ్ విడుదల చేసిన ఈ వీడియోతో తన పెళ్లి వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది.
Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE
— Medi Samrat (@Journo_Samrat) July 1, 2022