దర్శనం మొగులయ్యుకి రూ. రెండు లక్షలు అందజేసిన పవన్ కళ్యాణ్..!
జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యుకి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.;
జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యుకి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన రూ. రెండు లక్షల ఆర్ధిక సహాయాన్ని పవన్ స్వయంగా ఈ రోజు అందజేశారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాకి రూ. 50 చెక్కును అందజేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో వీరిద్దరిని పవన్ సత్కరించారు. కాగా పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో దర్శనం మొగులయ్యు ఓ పాట పాడగా ఆ పాటకి మంచి గుర్తింపు లభించింది.