Pawan Kalyan Vakeel Saab : "వకీల్ సాబ్'' డబ్బింగ్ పూర్తి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కిన చిత్రం ''వకీల్ సాబ్''... ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు-శిరీష్ నిర్మించారు;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కిన చిత్రం ''వకీల్ సాబ్''... ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు-శిరీష్ నిర్మించారు. రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఈ రోజు కంప్లీట్ చేశారు. దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పవన్ కల్యాణ్ తో పాటుగా ఈ సినిమాలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డైలాగ్స్: తిరు,
యాక్షన్ రవివర్మ,
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్,
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: బోనీ కపూర్,
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ ,
మాటలు-మార్పులు-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.