పవన్ కళ్యాణ్ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్.. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
శివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.;
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతోంది. 15వ శతాభ్ధం కాలం నాటి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుంది అంటున్నారు. ఎఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. శివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ క్రేజీ మూవీ టైటిల్ " హరిహర వీరమల్లు ".
'హరిహర వీరమల్లు' ఫస్ట్ లుక్ అద్భుతంగా అనిపిస్తోంది. ఇందులో పవన్ లుక్ పూర్తిగా కొత్తదనంతో కనిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ అద్భుతమైన విజన్‌కు తగ్గట్లు కీరవాణి టెర్రఫిక్ మ్యూజిక్, గ్రాండియర్ విజువల్స్‌తో ఈ ఫస్ట్ గ్లిమ్స్ కేక పుట్టిస్తోంది.
"ఇది ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ." అని డైరెక్టర్ క్రిష్ చెబుతున్నారు. 15వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుందని మూవీ యూనిట్ చెబుతోంది.