Pelli Sanadi : 'పెళ్లి సందD' సినిమా హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. మెగా హీరోతో...!
Pelli Sanadi : ఎంతోమంది హీరోయిన్ లను స్టార్ లని చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది.;
Pelli Sanadi : ఎంతోమంది హీరోయిన్ లను స్టార్ లని చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపైన హీరోయిన్లను గ్లామర్‌గా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలా తెలుగు తెరకి రాఘవేంద్రరావు వదిలిన మరోబాణమే శ్రీలీల.. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ.
ఈ సినిమాలో శ్రీలీల అందం, అభినయంతో ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడీ ఈ భామకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆమె మాస్ మహారాజా రవీతేజ 'ధమకా' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఓ మెగా హీరో సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ చేయబోయే సినిమాలో శ్రీలీలకి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టుగా సమాచారం. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.