#BroTheAvatar : టీజర్ వచ్చేస్తోంది... ఫ్యాన్స్ కు పండగే మరి
బ్రో టీజర్ పై ఆసక్తికరమైన అప్ డేట్;
సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న బ్రో సినిమా టీమ్ నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం తొక్కిసలాడుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న బ్రో లో మామ అల్లుళ్లు రచ్చ రచ్చ చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇహనో ఇప్పుడో టీజర్ విడుదలవ్వబోతుండగా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రెకెత్తించేందుకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం షోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
ఈ లుక్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ ఇండస్ట్రీనే పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది అనడంలో సందేహమే లేదు. మామా అల్లుళ్లు ఇద్దరూ ఊరమాస్ లుక్ లో ఇరగదీశారనే చెప్పాలి. మొత్తానికి డైరెక్టర్ గా సముత్తిరఖని బాక్సాఫీస్ ను షేక్ చేసేట్లే కనిపిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ మాత్రమే ఇంత క్రేజీగా ఉంటే టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో, షోషల్ మీడియాను ఓ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాలి.
#BroTheAvatar