Pooja Hegde: కారణం లేకుండానే అతడు అలా ప్రవర్తించాడు: పూజా హెగ్డే

Pooja Hegde: పూజా హెగ్డేకు అలాంటి ఓ చేదు అనుభవమే ఎదురయ్యింది. దీని గురించి పూజా.. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.;

Update: 2022-06-09 14:15 GMT

Pooja Hegde: సెలబ్రిటీలకు ఎక్కడికి వెళ్లినా.. స్పెషల్ వెల్‌కమ్ లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా.. అక్కడి స్టాఫ్ అంతా వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. కానీ అప్పుడప్పుడు సెలబ్రిటీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది కూడా స్టాఫ్ వల్లే. తాజాగా పూజా హెగ్డేకు కూడా అలాంటి ఓ చేదు అనుభవమే ఎదురయ్యింది. దీని గురించి పూజా.. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

విమానాల్లో ప్రయాణించేటప్పుడు సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఓ విమాన సంస్థ అయినా వారికి అసౌకర్యం కలగకుండా ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తాజాగా పూజా హెగ్దేకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ట్విట్టర్‌ వేదికగా పూజా ఫిర్యాదు చేసింది.

విపుల్‌ నకాషే అనే ఉద్యోగి తనతో అహంకారంగా, అజ్ఞానంతో మాట్లాడాడని, ఎలాంటి కారణాలు లేకుండానే వేధించాడని తెలిపింది పూజా. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి తాను ట్వీట్‌ చేయనని.. కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పూజా హెగ్దే పేర్కొంది. దీనిపై స్పందించిన ఇండిగో యాజమాన్యం.. పూజా హెగ్దేకు క్షమాపన చెప్పింది. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


Tags:    

Similar News