Sita Ramam: 'సీతారామం'లో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరంటే..?
Sita Ramam: మృణాల్‌కంటే ముందు ‘సీతారామం’ మూవీ టీమ్ మరో హీరోయిన్‌ను ఫైనల్ చేసిందట.;
Sita Ramam: 'సీతారామం' సినిమా ఓ క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. కేవలం తెలుగులోనే కాదు విడుదలయిన ఇతర భాషల్లో కూడా ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే మృణాల్‌కంటే ముందు మూవీ టీమ్ మరో హీరోయిన్‌ను ఫైనల్ చేసిందట.
మృణాల ఠాకూర్ ముందుగా హిందీ సీరియల్స్‌లో హీరోయిన్‌గాచ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అందులో పలు సీరియళ్లు తనకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో తనకు మరాఠీ చిత్రాల్లో.. ఆపై హిందీ చిత్రాల్లో కూడా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. హిందీలో తను చేసింది తక్కువ సినిమాలే అయినా పలువురు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ భామ. ఇక సౌత్‌లో 'సీతారామం' డెబ్యూతో తన కెరీర్ మరో మలుపు తిరిగింది.
అయితే ముందుగా 'సీతారామం'లో హీరోయిన్ క్యారెక్టర్ కోసం పూజా హెగ్డేను సంప్రదించిదట మూవీ టీమ్. దీనికి పూజా ఓకే కూడా చెప్పిందట. కానీ కోవిడ్ వల్ల అనుకున్న సమయంకంటే షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో పూజాకు డేట్స్ కుదరక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అసలే ఫ్లాపులతో సతమతమవుతున్న పూజాకు ఈ మూవీ మంచి హిట్ ఇచ్చేదని, అనవసరంగా మిస్ చేసుకుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.