Poorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
Poorna: షమ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ.. నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా బాగానే గుర్తింపు సంపాదించుకుంది.;
Poorna: ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో పెళ్లిల కంటే విడాకులే ఎక్కువగా జరుగుతున్నాయేమో అని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు. అందుకే సెలబ్రిటీల పెళ్లి కుదిరి ఎంగేజ్‌మెంట్ జరిగినా కూడా పెళ్లి జరిగే వరకు అది జరుగుతుందో లేదో చెప్పలేకపోతున్నాం. తాజాగా పూర్ణ కూడా ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నటి తన సోషల్ మీడియా పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది.
షమ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ.. నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించడంతో మళ్లీ ఈ భామ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా పలు సినిమా అవకాశాలు కూడా అందుకుంది. ప్రస్తుతం ఓవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలతో బిజీగా గడిపేస్తున్న పూర్ణ.. దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
పూర్ణ ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎప్పటిలాగానే షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. అయితే ఇంతలోనే తను ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుందంటూ వార్తలు మొదలయ్యా్యి. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే సోషల్ మీడియాలో ఫోటోలు ఎందుకు డిలీట్ చేయలేదు అని చాలామంది అనుమానం వ్యక్తం చేసినా.. దీనిపై ఓ క్లారిటీ మాత్రం లేదు. తాజాగా తనకు కాబోయే భర్తతో ఫోటో దిగి 'ఎప్పటికీ నావాడే' అన్న క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది పూర్ణ. దీంతో ఒక్కసారిగా వారి పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది.