ప్రభుదేవా సంచలన నిర్ణయం... షాక్‌లో ఫ్యాన్స్..!
కోరియోగ్రఫర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడు సత్తా చాటాడు ప్రభుదేవా.;
కోరియోగ్రఫర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడు సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా.. తొలి చిత్రంతోనే మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. అయితే ఈ మధ్య ప్రభుదేవా చేసిన సినిమాలేవీ ఆశించినంత స్థాయిలో ఆడడం లేదు. సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించిన రాధే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీనితో డైరెక్షన్ కి గుడ్‌బై చెప్పి.. పూర్తిగా నటుడిగా కొనసాగాలని ప్రభుదేవా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో నటించనున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రభుదేవా డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పడం అభిమానులను షాక్‌కి గురిచేస్తుంది.