MAA Elections 2021 : ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఇదే.. !
నిన్నటి వరకు అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని అనుకున్న హేమ, జీవితా రాజశేఖర్‌లు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బరిలో నిలిచారు.;
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని అనుకున్న హేమ, జీవితా రాజశేఖర్‌లు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని నటుడు ప్రకాష్‌రాజ్ ప్రకటించారు. ఆయన ప్యానల్‌లో అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూం, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్,డి.సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జాన్ ఉన్నారు. ఇక అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ఉండనుండగా, ఉపాధ్యక్షుడిగా బెనార్జీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా హేమ, శ్రీకాంత్ ఆయన తెలిపారు. జాయింట్ సెక్రటరీ లుగా అనిత చౌదరి, ఉత్తేజ్ మరియు కోశాధికారి నాగినీడు, జనరల్ సెక్రటరీ- జీవితా రాజశేఖర్ ఉండనున్నారు. 'మా' ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి.