Prakash Raj Biography : ప్రకాష్ రాజ్ అసలు పేరేంటి? ఇష్టం లేకుండా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు?
Prakash Raj Biography : 1965 మార్చి 26న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించాడు ప్రకాష్ రాజ్... ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.. ప్రకాష్ రాజు తమ్ముడు పేరు ప్రసాద్ రాయ్.;
Prakash Raj Biography : 1965 మార్చి 26న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించాడు ప్రకాష్ రాజ్... ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.. ప్రకాష్ రాజు తమ్ముడు పేరు ప్రసాద్ రాయ్.. ఈయన కూడా నటుడే.. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరుకి వచ్చింది.
ఆయన తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయి బెంగుళూరుకు వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అలా వారికి ప్రకాష్ రాయ్, ప్రసాద్ రాయ్ జన్మించారు.
ప్రకాష్ రాజ్ కి నాటకాలు అంటే ఇష్టం.. డిగ్రీ మద్యలోనే అపేసి నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. ఓ నాటక సంస్థలో చేరి అక్కడ హావభావాలు ఎలా పలికించాలో పట్టు సాధించాడు. ఆ సంస్థ వేసే ప్రతి నాటకానికి మూడు వందల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకునేవాడు. ఈ టైంలోనే ప్రకాష్ రాజ్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ నాటకాలు అంటే అభిమానం ఉన్న ప్రకాష్ రాజ్.. సినిమాలను సున్నితంగా తిరస్కరించారు.
కర్ణాటకలో సినిమాల కన్నా నాటకాలే ఫేమస్ కూడా..అయితే ప్రకాష్ రాజ్ కి ఓ సారి డబ్బులు అవసరం రావడంతో జేబులో చూస్తే డబ్బుల కంటే సినిమా ఆఫర్ ఇస్తామన్న నిర్మాతల విస్టింగ్ కార్డ్స్ ఎక్కువగా కనిపించాయి. దీనితో అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.. అలా నాటకాలు వేస్తూనే డబ్బులు అవసరం ఉన్న ప్రతిసారి సినిమాలు చేసేవాడు. అలా ఏడు సినిమాలు ఇష్టం లేకుండానే చేశాడు. చేసే ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పుకోవడం ప్రకాష్ రాజ్ కి ఉన్న స్పెషాలిటీ అని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ఏడు భాషల్లోనూ సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటాడు.
తమిళ్ లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ సినిమాతో ప్రకాష్ రాయ్ గా ఉన్న తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చారు. ఇది బాలచందర్ సలహాతోనే కావడం విశేషం. తెలుగులో సంకల్పం సినిమా మొదటిది. ఆ తర్వాత ఎన్నో బాషల్లో, ఎన్నో సినిమాల్లో, ఎన్నో పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు సంపాదిచుకున్నాడు. ఆయన పోషించిన పాత్రలకి లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ కి నటుడిగా ఎంతమంచి పేరు వచ్చిందో అన్నీ వివాదాలు కూడా ఆయన్ని వెంటాడాయి కూడా. పలుమార్లు మా అసోసియేషన్ ఆయన్ని బ్యాన్ చేసింది కూడా.. అయితే అతని రోల్ లో ఎవరు రీప్లేస్ చేయకపోవడంతో మళ్లీ బ్యాన్ ని ఎత్తివేశారు. బ్యాన్ చేసినప్పుడు కుంగిపోలేదు.. ఎత్తివేసినప్పుడు సంతోషించలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అదే మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పోటీ చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు ప్రకాష్ రాజ్.