Prakash Raj : మాకు కొన్ని సందేహాలున్నాయి.. అందుకే సీసీ ఫుటేజ్ చూడ్డానికి వచ్చా : ప్రకాష్‌రాజ్
Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సీసీ ఫుటేజ్ రగడ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ చూసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు ప్రకాష్‌రాజ్ వచ్చారు.;
Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సీసీ ఫుటేజ్ రగడ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ చూసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు ప్రకాష్‌రాజ్ వచ్చారు. ఆయనకు పోలీసులు సీసీ ఫుటేజ్ చూపించనున్నారు. మా ఎన్నికల రోజు రెండు ప్యానళ్ల మధ్య స్వల్ప వివాదాలు చెలరేగాయి. ఈ నేపత్యంలో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్‌కు ప్రకాష్‌రాజ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. తమకూ కొన్ని సందేహాలున్నాయి.. అందుకే సీసీ ఫుటేజ్ చూడ్డానికి వచ్చానంటూ ప్రకాష్‌రాజ్ చెబుతున్నారు. ఆరోజు కొందరు సభ్యులపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో.. ప్రకాష్‌రాజ్ ఆ సీసీ ఫుటేజ్ చూస్తున్నారు.