Prakash Raj : మళ్ళీ పెళ్లి చేసుకున్న ప్రకాష్‌రాజ్ ..!
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ తన కుమారుడి కోరిక మేరకు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.;
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ తన కుమారుడి కోరిక మేరకు తన భార్య పోనీవర్మని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తమ 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొడుకు వేదాంత్ తమ పెళ్లి చూడాలని పట్టుబట్టడంతో మరోసారి పెళ్లి చేసుకున్నామని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "మా వివాహానికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం" అని ప్రకాష్‌రాజ్ తన ట్విట్‌లో తెలియజేశారు. అయితే ఈ వివాహానికి మొదటి భార్య పిల్లలు కూడా హాజరయ్యారు. కాగా ప్రకాష్‌రాజ్ మొదటి భార్య లలితకుమారికి విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని 2010లో రెండో వివాహం చేసుకున్నారు. అటు ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రకాష్‌రాజ్.