Prakash Raj : త్రిష ఎడిట్ వీడియో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్..
Prakash Raj : ప్రకాశ్ రాజ్ తిరు సినిమాలోని ఓ సీన్‌ను ఎవరో ఎడిట్ చేయడం దాన్ని ఆయన సోషల్ మిడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది;
Prakash Raj : ప్రకాశ్ రాజ్ తిరు సినిమాలోని ఓ సీన్‌ను ఎవరో ఎడిట్ చేయడం దాన్ని ఆయన సోషల్ మిడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది. ఇటీవళ ధనుష్ హీరోగా తిరు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ తన భార్య ఫోటోను చూస్తూ గత ఘ్నాపకాలను గుర్తు చేసుకుంటాడు.
ఈ సీన్‌లో ఎవరో ఎడిటర్.. ప్రకాశ్ రాజ్ భార్య ఫోటోను తీసి త్రిష ఫోటోను పెడతాడు. గత ఘ్నాపకాల్లో త్రిషతో ప్రకాశ్ రాజ్ 2004లో యాక్ట్ చేసిన 'ఒక్కడు' సినిమాలోని సీన్స్ పెడతాడు. ఈ ఎడిట్ వీడియోను ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఎడిట్ చేశారో గానీ చాలా సంతోషంగా ఉందంటూ ప్రకాశ్ రాజ్ త్రిషను కూడా ట్యాగ్ చేశారు. స్మైలీ ఎమోజీతో త్రిష రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.
Who ever did this .. made my day ❤️❤️ thank you for the love … CHELLAM s I love uuuuu #muthupandi #gilli @trishtrashers pic.twitter.com/K5F74stwfa
— Prakash Raj (@prakashraaj) September 18, 2022