Pranitha Subhash: హీరోయిన్ ప్రణీత సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Pranitha Subhash: ఇటీవల ప్రణీత సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.;
Pranitha Subhash: నటీనటులు తమ కెరీర్‌లో ఎన్ని పాత్రలు చేసినా.. ఒక్క పాత్ర మాత్రం వారికి ఎనలేని గుర్తింపును తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఆ పాత్రతోనే ప్రేక్షకులు తమని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అలాగే టాలీవుడ్‌లో బాపు గారి బొమ్మ అనగానే గుర్తిచ్చేది ప్రణీత సుభాష్. ఇప్పుడు ఈ నటి సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది.
2021 సంవత్సరంలో మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది ప్రణీత. అయితే తన పెళ్లి విషయం తానే సోషల్ మీడియాలో వెల్లడించే వరకు బయటికి రాలేదు. సెకండ్ లాక్‌డౌన్ సమయం కావడంతో చాలా తక్కువమంది సమక్షంలో ప్రణీత పెళ్లి జరిగిపోయింది. కానీ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మాత్రం సంతోషంగా ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఇటీవల ప్రణీత సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండడంతో మరోసారి అందరూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టినప్పటి నుండి ప్రణీత గర్భిణీలకు ఎన్నో చిట్కాలను అందిస్తూ.. తన అనుభవాన్ని కూడా అందరితో పంచుకుంటూ.. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది.