Pranitha Subhash: ప్రెగ్నెన్సీపై ప్రణీత పోస్ట్.. శరీరంలో వచ్చే మార్పుల గురించి చెప్తూ..
Pranitha Subhash: ప్రణీత.. తాను ప్రేమించిన వ్యాపారవేత్త నితిన్ రాజును కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.;
Pranitha Subhash: టాలీవుడ్‌లోని ఎంతోమంది సీనియర్ నటీమణులు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఉమెన్‌గా సెటిల్ అయిపోయారు. అంతే కాకుండా పిల్లలతో కలిసి సినిమాలకు దూరంగా హ్యాపీగా గడిపేస్తున్నారు. తాజాగా ప్రణిత కూడా త్వరలోనే తన ఫ్యామిలీలోకి ఓ కొత్త వ్యక్తిని ఆహ్వానించనుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వారు ఎలా ఫీల్ అవుతున్నారో అందరితో పంచుకోవడానికి హీరోయిన్లు ఇష్టపడతారు. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో ప్రణీత కూడా అదే చేసింది.
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రణీత.. తాను ప్రేమించిన వ్యాపారవేత్త నితిన్ రాజును కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తను తరువాతి రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఎవరికీ తెలియదు. కానీ ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం వెంటనే ఓ క్యూట్ పోస్ట్‌తో అభిమానులతో పంచుకుంది ఈ బాపు గారి బొమ్మ. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల గురించి వివరిస్తూ తాజాగా మరో పోస్ట్ చేసింది ప్రణీత.
'ఇప్పటికి ఇవే లాస్ట్. పెరుగుతున్న ప్రతీ పౌండ్ బరువును, చర్మంపై వస్తున్న మార్క్స్‌ను, ఉబ్బిపోతున్న నా మొహాన్ని, నా పెద్ద ముక్కును, భరించలేని నొప్పిని.. అన్నింటినీ నేను స్వాగతిస్తున్నాను. ఇవన్నీ విలువైనవని నాకు నేనే చెప్పుకుంటున్నాను.' అంటూ ప్రణీత బేబి బంప్‌తో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలా ఉన్నా ప్రణీత అందంగానే ఉంటుంది అంటూ తన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.