Priyanka Mohan: జాక్‌పాట్ కొట్టిన 'గ్యాంగ్‌లీడర్' బ్యూటీ.. ఏకంగా సూపర్ స్టార్‌తో..
Priyanka Mohan: నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక మోహన్.;
Priyanka Mohan: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించాలంటే సీనియర్ హీరోయిన్స్ అయితే బెటర్ అని మేకర్స్ భావించేవారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనా విధానం కూడా మారిపోయింది. అందుకే యంగ్ బ్యూటీలను సినిమాలో క్యాస్ట్ చేసుకుంటున్నారు. అందుకే గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ కూడా సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.
నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక మోహన్. మొదటి సినిమాలోనే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టింది ఈ భామ. శివకార్తికేయన్‌తో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అక్కడే సెటిల్ అయిపోయింది.
ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు తప్పకుండా ఉంటారు. ఇక ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో శ్రీలీల ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ బంపర్ ఆఫర్ ప్రియాంకను వరించిందని సమాచారం.