Bandla Ganesh : హీరోగా బండ్ల గణేష్.. దర్శకుడు ఎవరంటే?
Bandla Ganesh : బండ్ల గణేష్... తెలుగు తెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు.;
Bandla Ganesh : బండ్ల గణేష్... తెలుగు తెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బడా ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మధ్యలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ చిన్న పాత్ర చేసి మెప్పించాడు కానీ.. ఇక పై ఆలాంటి పాత్రలు చేయనంటూ ఆ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు గణేష్ హీరో అవతారం ఎత్తబోతున్నాడు. అవును బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. వెంకట్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బండ్ల గణేష్‌కి బాగా నచ్చిందట.. ఈ సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాని స్వయంగా ఆయనే నిర్మించనున్నారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది త్వరలోనే చూడాలి మరి. అంతేకాకుండా తమిళంలో సూపర్‌హిట్ అయిన 'మండెల' రీమేక్‌లో హీరోగా నటించాలని కోరితే ఆయన దానిని రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్.