Puri Jagannadh: 'ఐ లవ్యూ ఛార్మి'.. స్టేజ్‌పై పూరీ జగన్నాధ్ ప్రపోజల్
Puri Jagannadh: హీరోయిన్‌గా చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది చార్మీ.;
Puri Jagannadh: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు సన్నిహితంగా కనిపించినా.. వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. నటీనటులు మాత్రమే కాదు.. పాపులర్ దర్శకులు, నిర్మాతలు విషయంలో కూడా ఇదే పరిస్థితి. కొందరు అలాంటి వార్తలను ఖండిస్తూ ఉంటే.. మరికొందరు మాత్రం ఎవరు ఏమి అనుకున్నా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇక తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాధ్.. స్టేజ్‌పైనే చేసిన పని ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది.
హీరోయిన్‌గా చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది చార్మీ. తక్కువ సమయంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. చాలామంది స్టార్ హీరోలతో కూడా జోడీకట్టింది. కానీ ఏమైందో తెలియదు ఆన్ స్క్రీన్ వదిలేసి ఆఫ్ స్క్రీన్ వెళ్లిపోయింది. అదే సమయంలో పూరీ జగన్నాధ్ నిర్మాణ సంస్థలో పార్ట్‌నర్‌గా మారిపోయింది. అప్పటినుండి వారిద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.
పూరీ జగన్నాధ్, ఛార్మీ మధ్య సాన్నిహిత్యాన్ని చూసి ప్రేక్షకులు సైతం వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం మొదలుపెట్టారు. దానికి వీరిద్దరూ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఓవైపు ఛార్మీకి వివాహం కాలేదు. మరోవైపు పూరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులోనూ కొడుకు ఇప్పుడు హీరోగా కూడా మారాడు. అయినా వీరిద్దరి రిలేషన్‌పై వచ్చే రూమర్స్ మాత్రం ఆగలేదు.
ఇటీవల పూరీ జగన్నాధ్, ఛార్మీ తాము తెరకెక్కించిన 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల వరంగల్‌లో జరిగిన ఈవెంట్‌లో పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్, రమ్యకృష్ణ గురించి మాట్లాడిన పూరీ.. ఛార్మీ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. 'ఛార్మీ ఎప్పుడూ ఏ సమస్యను నా వరకు తీసుకువచ్చేది కాదు. ఒంటరిగానే ఏడ్చేది. సినిమా నిర్మాణం సాఫీగా సాగిందంటే తనే కారణం.' అన్న పూరీ చివరిగా ఐ లవ్యూ అంటూ తన స్పీచ్‌ను ముగించారు.