Allu Arjun Pushpa 2 ది రూల్ భారీ అంచనాలు, కానీ అనుమానాలు

Update: 2024-12-04 10:04 GMT

పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన "పుష్ప: ది రైజ్" తర్వాత, సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అల్లూ అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

గతంలో పుష్పరాజ్‌గా అల్లూ అర్జున్ మాస్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దులను చేశాయి. ఇప్పుడు సీక్వెల్‌లో పుష్పరాజ్‌ పోరాటం, అతడి ప్రతీకారం, శత్రువుల మీద విజయం మరింత ఉత్కంఠ రేపనున్నాయి. ఫహద్ ఫాసిల్‌ మరోసారి భాన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో వారి మధ్య ఢీకొట్టే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

అయితే సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ఈ సినిమాపై విమర్శలు కూడా చేస్తున్నారు. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించినప్పటికీ, సీక్వెల్ హైప్‌తోనే ముందుకు సాగుతుందని, కథాబలం లేకపోతే దీర్ఘకాలంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లు బాగా వైరల్ అయినప్పటికీ, కథలో కొత్తదనం ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, కుబా విజువల్ ట్రీట్‌ సినిమాకు ప్రధాన బలంగా ఉన్నా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చే కథపరమైన కొత్తదనం కీలకంగా మారనుంది. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టి, పుష్ప 2 గ్లోబల్ స్థాయిలో విడుదల కావడం వల్ల భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

అల్లూ అర్జున్ పుష్పరాజ్‌గా మరోసారి తన యాక్టింగ్‌, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాదు సినిమాకు లాంగ్ రన్ హిట్‌గా నిలబెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు హైప్‌కు సరితూగే కంటెంట్ ఉంటేనే సినిమా ఘన విజయం సాధించగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మొదటి షో తర్వాత ప్రేక్షకుల రియాక్షన్ ఏమిటో చూడాలి.

Tags:    

Similar News