Raashi Khanna: 'రొమాంటిక్ సీన్సే ఈజీ'.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Raashi Khanna: చాలావరకు యంగ్ హీరోలతో నటించిన రాశి ఖన్నా.. పలుమార్లు స్టార్ హీరోలతో కూడా జోడికట్టింది.;
Raashi Khanna: కొందరు నటీనటులకు కొన్ని జోనర్లలో సినిమాలు చేయడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. అలా ముద్దుగుమ్మ రాశి ఖన్నా కూడా ఇటీవల తనకు ఏ జోనర్ ఇష్టమో చెప్పి ఆశ్చర్యపరిచింది. ముందుగా బాలీవుడ్‌లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమయిన రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగులో కూడా పరిచమయ్యింది. తాజాగా పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన ఫేవరెట్ జోనర్ గురించి బయటపెట్టింది రాశి.
చాలావరకు యంగ్ హీరోలతో నటించిన రాశి ఖన్నా.. పలుమార్లు స్టార్ హీరోలతో కూడా జోడికట్టింది.ఇక చాలాకాలం తర్వాత బాలీవుడ్ నుండి పిలుపందుకొని.. అక్కడ అజయ్ దేవగన్ సరసన రుద్ర అనే సిరీస్‌లో నటించింది. ఇటీవల గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్ చేసింది. ఇక ఈ సినిమాలో రాశి ఓ కామెడీ లాయర్ పాత్రలో కనిపించనుంది.
కామెడీ సీన్లు చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అని రాశిని అడిగిన ప్రశ్నకు.. తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం ఈజీ అనే సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా కామెడీ చేయడం చాలా కష్టం అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అయితే రొమాంటిక్ సీన్స్‌లో నటించి బోర్ కొట్టిందని, కామెడీ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది రాశి ఖన్నా.