Radhika Apte: పెళ్లిరోజు బాగా డ్రింక్ చేశాం.. అందుకే అలా: రాధికా ఆప్టే
Radhika Apte: లండన్‌కు చెందిన మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే ప్రేమించి పెళ్లి చేసుకుంది.;
Radhika Apte: పెళ్లి అంటే అన్‌లిమిటెడ్ ఫన్. ముఖ్యంగా ఈరోజుల్లో పెళ్లిళ్లు సీరియస్‌గా కంటే సరదాగానే ఎక్కువగా సాగిపోతున్నాయి. వరుడు, వధువు డ్యాన్స్, సంగీత్‌లు, బరాత్‌లు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు పెళ్లిలో ఫ్యాషన్ అయిపోయాయి. నటీనటులు సైతం తమ పెళ్లిని కొత్తగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అయితే కెరీర్ ఫామ్‌లో ఉండగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే.. ఇటీవల తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
'లెజెండ్'లాంటి సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది రాధికా ఆప్టే. దాంతో పాటు ఇంకా ఎన్నో కమర్షియల్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఇప్పటికీ ఈ అమ్మడి హవా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకునే రాధికా.. తన పెళ్లి విషయం కూడా కాంట్రవర్సీ చేసింది. ఎందుకంటే తనకు పెళ్లయిన విషయాన్ని తానే స్వయంగా చెప్పినా ఎవరూ నమ్మలేదు.
లండన్‌కు చెందిన మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాతో బయటపెట్టింది. కానీ ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే తన పెళ్లి ఫోటోలను ఒక్కటి కూడా రాధికా ఎవరికీ చూపించలేదు. దానికి గల కారణాన్ని తను ఇటీవల బయటపెట్టింది. పెళ్లిరోజు తను, తన భర్త, పెళ్లికి వచ్చిన తమ ఫ్రెండ్స్ అందరూ ఫుల్‌గా డ్రింక్ చేశారని, అందుకే వారు ఫోటోల గురించి మర్చిపోయాని తెలిపింది రాధికా. అంతే కాకుండా తన భర్తకు ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం పెద్దగా నచ్చదని స్పష్టం చేసింది.