Rajamouli wife : న్యూస్ రీడర్‌గా రాజమౌళి భార్య.. వీడియో వైరల్
Rajamouli : టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి.;
Rajamouli : టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. ఇదిలా ఉంటే రాజమౌళితో పాటుగా ఆయన కుటుంబం మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన భార్య రమా రాజమౌళి ఆయన అన్నీ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తారు.
అయితే ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రమా రాజమౌళి గతంలో న్యూస్ రీడర్‌గా పనిచేసినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆమె న్యూస్ రీడర్‌గా చేసింది వాస్తవమే కానీ అది కేవలం సీరియల్‌లో ఓ పాత్ర కోసం మాత్రమే. నిజ జీవితంలో ఆమె న్యూస్ రీడర్‌గా పనిచేయలేదు. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన అమృతం సీరియల్ లో ఆమె న్యూస్ రీడర్‌గా కనిపించారు. ఈ సీరియల్ లో రాజమౌళి అన్నయ్య కాంచి కూడా నటించారు.