Ram Gopal Varma: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్‌వర్మ.. ఆ ఇద్దరిపై ఫిర్యాదు..
Ram Gopal Varma: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు;
Ram Gopal Varma: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నిర్మాత నట్టి కుమార్, నట్టి కరుణపై కంప్లైంట్ ఇచ్చారు. వారిద్దరూ నకిలీ పత్రలు సృష్టించి తనపై దావా వేశారని.. 2020, నవంబర్ 30న తన లెటర్ హెడ్ తీసుకొని ఫోర్జరీ పత్రలు సృష్టించారన్నారు. ఫేక్ సిగ్నేచర్ ద్వారా తానే వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సృష్టించారని ఆరోపించారు. తప్పు దోవ పట్టించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలు ఫోరెన్సిక్‌కు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు.
On my way to Punjagutta police station along with my Advocate
— Ram Gopal Varma (@RGVzoomin) May 28, 2022