Ram Gopal Varma: అసలు శత్రువు రాజమౌళినే: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: ఓటీటీలు కూడా థియేటర్ ఓనర్లకు శత్రువుల్లాగా మారాయి. ఇక దీనికి కారణం ఏంటో తన స్టైల్‌లో వివరించారు వర్మ.

Update: 2022-08-04 09:31 GMT

Ram Gopal Varma: అందరూ ఓ విషయాన్ని ఒకేలా ఆలోచిస్తే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం అదే విషయాన్ని అందరికంటే భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆయన మాటలు అంత సులువుగా ఎవరికీ అర్థం కావు. ఈమధ్యకాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు అన్ని ఇండస్ట్రీలను శాసించి వరుస హిట్లతో దూసుకుపోయిన టాలీవుడ్ కూడా ఇప్పుడు చతికిలపడింది. దీనిపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల స్పందించారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించే వరకు షూటింగ్స్ ఆపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దాదాపు గత రెండు నెలలుగా థియేటర్లలో విడుదలయిన ఏ స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా అంతగా లాభాలను తెచ్చిపెట్టలేదు. అందుకే షూటింగ్స్ కూడా కొన్నాళ్లు ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అంతే కాకుండా ఓటీటీలు కూడా థియేటర్ ఓనర్లకు శత్రువుల్లాగా మారాయి. దీనికి కారణం ఏంటో తన స్టైల్‌లో వివరించారు వర్మ.

ఓటీటీలే థియేటర్ల నష్టానికి కారణం అని అందరూ అనుకుంటుండగా.. వర్మ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్‌ చానళ్లే అని ఓ భిన్నమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేక్షకులు షాట్‌ వీడియోలకు అలవాటు పడ్డారని, ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారని చెప్పుకొచ్చారు. థియేటర్లో రెండు గంటల పాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ లేదా కేజీయఫ్‌ లాంటి సినిమాలు మాత్రమే తీయాలని అన్నారు వర్మ.



Tags:    

Similar News