Rao Ramesh : గొప్ప మనసు చాటుకున్న నటుడు రావు రమేష్..

Rao Ramesh : రావు రమేశ్ సినిమాలో విలన్ పాత్రలు వేసినా నిజజీవితంలో హీరో అనిపించుకున్నారు;

Update: 2022-09-16 15:11 GMT

Rao Ramesh : రావు రమేశ్ సినిమాలో విలన్ పాత్రలు వేసినా నిజజీవితంలో హీరో అనిపించుకున్నారు. తన దగ్గర పనిచేసే మేకప్‌మ్యాన్ బాబు ఇటీవళ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రావు రమేశ్ స్వయంగా మేకప్‌మెన్ బాబు ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అంతే కాకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎటువంటి సమస్య వచ్చినా తాను ఉన్నానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

రావురమేశ్ చేసిన సాయానికి ఆయనకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. అందరు పెద్ద నటులు రావు రమేశ్‌లా తమ దగ్గర పనిచేసే వాళ్లను ఆదుకోవాలని నెటిజన్లు అభిమానులు అంటున్నారు. 

Tags:    

Similar News