Rashmika Mandanna : రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిన రష్మిక..
Rashmika mandanna : రష్మిక మందన ఇప్పుడు సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది;
Rashmika Mandanna : రష్మిక మందన ఇప్పుడు సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' మూవీలో నటించింది, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో నటిస్తోంది. రణ్‌వీర్ కపూర్‌తో కూడా కలిసి నటించనుంది ఈ పుష్ఫ సుందరి. అయితే రష్మికకు డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. పూష్ప 2 చిత్రానికి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్. ఇక పై నటించే ప్రతీ చిత్రానికీ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనుంది.
కన్నడలో కిరిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తరువాత నాగచైతన్యతో కలిసి చలో సినిమా చేసింది. తెలుగులో మొదటి సనిమా చలో.. అది సూపర్ హిట్ కావడంతో వెంటనే గీతా గోవిందంలో అవకాశం దక్కింది. ఇక అక్కడి నుంచి టాప్ హీరోలతో టాప్ బ్యానర్లో నటిస్తూ వచ్చింది. హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల సినిమాల్లో రష్మిక నటించింది.