Rashmika Mandanna: అక్కినేని హీరోతో రష్మిక రొమాన్స్..
Rashmika Mandanna: రష్మిక తెలుగులో ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఇది కాకుండా తన చేతిలో మరో తెలుగు సినిమా లేదు.
Rashmika Mandanna: ప్రస్తుతం ఇతర పాన్ ఇండియా హీరోయిన్లకు రష్మిక గట్టి పోటీనే ఇస్తోంది. గత కొంతకాలంగా తాను చేస్తున్న సినిమాలన్నీ హిట్లు కొడుతుండడంతో రష్మిక డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఇక కోలీవుడ్, బాలీవుడ్‌పై కూడా ఈ కన్నడ బ్యూటీ ఫోకస్ పెడుతోంది. ఇంతలోనే తెలుగులో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఓ అక్కినేని హీరోతో ఈ భామ ఆడిపాడనుందట.
రష్మిక తెలుగులో ప్రస్తుతం 'పుష్ప 2'లో నటిస్తోంది. ఇది కాకుండా తన చేతిలో మరో తెలుగు సినిమా లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల విడుదలయిన 'సీతారామం'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. కోలీవుడ్‌లో విజయ్‌తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా అక్కినేని హీరోతో రష్మిక జతకట్టే ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి.
అక్కినేని హీరో నాగచైతన్య.. తెలుగులో ఇంకా ఏ సినిమాను కన్ఫర్మ్ చేయలేదు. కానీ త్వరలోనే సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్‌తో మూవీ ఉండనుందని.. ఇప్పటికే దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్గా రష్మికను అనుకుంటున్నారట మూవీ టీమ్. ఇదే కన్ఫర్మ్ అయితే నాగచైతన్య, రష్మిక మొదటిసారి జోడికడుతున్న చిత్రం ఇదే అవుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరొకొన్ని రోజులు ఆగాల్సిందే.