Kamal Haasan : 'ఇండియన్ 2' కమల్ చెప్పే ఆ డైలాగ్..

Kamal Haasan : విక్రమ మూవీతో పెద్ద హిట్ ఇచ్చిన కమల్‌హాసన్ ఇండియన్ 2తో మరో హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు;

Update: 2022-09-15 13:37 GMT

Kamal Haasan : విక్రమ మూవీతో పెద్ద హిట్ ఇచ్చిన కమల్‌హాసన్ ఇండియన్ 2తో మరో హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఈ మూవీలో కమల్ ఒక డైలాగ్‌ను 14 భాషల్లో చెబుతారంట.. సుమారు 10 నిమిశాలపాటు ఆ డైలాగ్ ఉంటుందని అంటున్నారు. ఈ డైలాగ్‌ను కమల్ సింగిల్ టేక్‌లో చేశారంటున్నారు. కమల్ పర్ఫామెన్స్‌తో అక్కడ యూనిట్‌లో ఉన్న అందరూ షాక్‌కు గురయ్యారట.

1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు అప్పట్లోనే భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే డైరెక్టర్ సీక్వెల్‌గా ఇండియన్ 2ను తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్ద్ ముఖ్యపాత్రలు పోషిస్తు్న్నారు. ప్రస్తుతం మేకింగ్ దశలో సినిమా ఉంది.

Tags:    

Similar News