RRR మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(రౌద్రం,రణం, రుధిరం).;
ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(రౌద్రం,రణం, రుధిరం). డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ చివరి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న టీం ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందనే ఫిలిం నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కష్టమని అంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో థియేటర్స్ రీ ఓపెన్ కాకపోవడం 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ విడుదలకు ప్రధాన ఆటంకంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టుగా సమాచారం. కాగా స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.