అలా కుదిరిందట.. కార్తికేయ క్యూట్ లవ్ స్టొరీ..!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయింత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది.;
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయింత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది. అతికొద్దిమంది సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరని చాలామంది నెటిజన్లు సెర్చ్ కూడా మొదలుపెట్టారు. ఆ సస్పెన్స్ కి తెరతీస్తూ ఆ అమ్మాయి ఎవరో చెప్పేశాడు కార్తికేయ.
''నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది'' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను కూడా షేర్ చేశాడు. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఈ క్రమంలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ జోడికి అభినందనలు తెలుపుతున్నారు.
2017లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. కానీ ఆ తరువాత వచ్చిన 'ఆర్ఎక్స్ 100' ఘనవిజయం సాధించి సూపర్ హిట్ అయింది. హీరోగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలోనూ మెప్పిస్తున్న కార్తికేయ నానీ హీరోగా నటించిన గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా నటించారు. మరో చిత్రం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'వలిమై'లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.