BRO Movie: అదరగొడుతున్న "బ్రో"
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సాయి ధరమ్‌తేజ్ కాంబీనేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు;
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సాయి ధరమ్‌తేజ్ కాంబీనేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మెగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం ముహుర్తాన్ని ఫిక్స్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5గంటలకు టీజర్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే పవన్‌కళ్యాన్, సాయి ధరమ్ తేజ్‌ల మాస్ పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్ సాయి ధరమ్ స్టైలీష్ లుక్స్‌లో కనిపించే పోస్టర్‌ను విడుదల చేశారు.
సినిమాను జూలై 28న విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు. అయితే బ్రో విషయానికి వస్తే.. ఒరిజినల్ వెర్షన్‌లో సముత్తిరఖని నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. సముత్తిరఖని నటించిన పాత్రలోనే పవన్ నటిస్తున్నారు. సాయిధరమ్, పవన్‌కళ్యాణ్ లతోపాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియ ఫ్యాక్టరీ జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు దక్కించుకుందట. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.