Sai Dharam Tej Tweet : సాయి తేజ్ ట్వీట్.. థంబ్స్ అప్'సింబల్ చూపిస్తూ..!
Sai Dharam Tej Tweet : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు.;
Sai Dharam Tej Tweet : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. నాపై, రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ 'థంబ్స్ అప్'సింబల్ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా గత నెల(సెప్టెంబర్)లో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా తేజు నటించిన 'రిపబ్లిక్' చిత్రం విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది.